జర్నల్ ఆఫ్ సిస్టమాటిక్ పాలియంటాలజీలో ప్రచురితమయిన కథనం ప్రకారం.. సుమారు 12 మీటర్ల పొడవుండే ఈ సముద్ర రాక్షసికి పొడవైన మెడ, అమ్మోనైట్‌ల వంటి కఠినమైన కవచాలు ఉన్న జీవులను పగలగొట్టగల బలమైన దంతాలు ఉండేవని అంచనా వేశారు. 1988లో వాంకోవర్ ద్వీపంలోని పంట్‌లెడ్జ్ నది వద్ద లభ్యమైన ఈ శిలాజం, ఉత్తర అమెరికాలో లభించిన ముఖ్యమైన శిలాజాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ, బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ 2023లో దీనిని తమ అధికారిక శిలాజ చిహ్నంగా ప్రకటించింది. ఈ ‘ట్రాస్కాసౌరా సాండ్రే’ ఆదిమ, ఆధునిక ప్లెసీయోసార్ లక్షణాల అసాధారణ కలయికను కలిగి ఉండటం దీని విశిష్టత. ముఖ్యంగా, దీని భుజం నిర్మాణం ఇతర ప్లెసీయోసార్లలో కనిపించని విధంగా ప్రత్యేకంగా ఉందని, ఇది నీటిలో లోతుగా ఈదడానికి ప్రత్యేక సామర్థ్యాలు ఉపయోగపడి ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రత్యేక లక్షణాల కారణంగానే, దీనిని కొత్త జాతిగా వర్గీకరించడానికి ఇంతకాలం పట్టిందని తెలిపారు. ఈ ఆవిష్కరణ, డైనోసార్ల యుగంలో పసిఫిక్ వాయువ్య ప్రాంత సముద్ర జీవవైవిధ్యంపై అమూల్యమైన వెలుగునిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ శిలాజం బ్రిటిష్ కొలంబియాలోని కోర్ట్నే అండ్ డిస్ట్రిక్ట్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీకటిలోనూ చూసేలా చేసే ఐ డ్రాప్స్! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
పొలాలను వదిలి.. చెంగు చెంగున ఎగురుతూ చెరువుల్లోకి చేపలు
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా
కలెక్టర్ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ
పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్

Надежный электрик по низкой цене в Москве
Электрика заказать Москва https://elektrik-master-msk.ru/ .