ఇందులో అర్జున్ సర్జాతోపాటు ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వేడుకకు పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, కన్నడ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ కన్నడ స్టార్ హీరోను ఆకాశానికెత్తేశారు. ఉపేంద్ర సినిమాలు తనపై చాలా ప్రభావం చూపించాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుక్కు. ఉపేంద్ర తెరకెక్కించిన A సినిమాను చూశాను. అలాగే ఓం చిత్రాన్ని చూశా… అని చెప్పిన సుక్కు.. ఇండియాలో ఏ దర్శకుడు కూడా అంత పిచ్చిగా, మ్యాడ్ గా, కన్ఫ్యూజింగ్ సినిమాలను రూపొందించలేదంటూ షాకింగ్ అండ్ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికీ A సినిమా చూస్తే అలాగే అనిపిస్తుందని… A, ఓం, ఉపేంద్ర.. ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చంటూ చెప్పారు. ఒకవేళ ఆ మూడు సినిమాలు చేస్తే తాను ఎప్పుడో రిటైర్ అయిపోయేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్ గా ఉండడానికి కారణం ఉపేంద్ర తెరెక్కించిన ఆ మూడు సినిమాలే అని తన స్క్రీన్ ప్లే సీక్రెట్ చెప్పారు సుక్కు. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్యర్చపరచడం తనకు అలవాటని అన్నారు. ఈ విషయాన్ని ఉపేంద్ర నుంచే తాను దొంగిలించానని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్
14 ఏళ్ల తర్వాత అవార్డ్స్.. అల్లు అర్జునే తొలి విజేత
