
గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్ అభిమానులను కలిసారు.. అలాగే సోషల్ మీడియాలో ఓ లెటర్ కూడా విడుదల చేసారు. దర్శకుడు శంకర్‌తో పాటు.. చిత్రయూనిట్‌కు, ఫ్యాన్స్‌కు, మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు చరణ్.
గేమ్ ఛేంజర్ సినిమా.. అప్పన్న పాత్ర తన మనసులో నిలిచిపోతుందని తెలిపారీయన. గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే రెండు సినిమాలకు కమిటయ్యారు రామ్ చరణ్. అందులో బుచ్చిబాబు సినిమా ఇప్పటికే మొదలైంది.
చరణ్ కూడా త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నారు. దీని తర్వాత సుకుమార్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. రంగస్థలం తర్వాత ఈ కాంబో రిపీట్ కానుంది. అలాగే పుష్ప 2తో హైలో ఉన్నారు సుకుమార్.
RC16, RC17 లైన్లో ఉండగానే.. దిల్ రాజుతో రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు.. అలాగే చరణ్‌ను దిల్ రాజు కలిసినట్లు వస్తున్న ఫోటో కూడా పాతదే.. పైగా చరణ్ ప్రస్తుతం ఇండియాలో లేరు.
ఒకవేళ దిల్ రాజుతో రామ్ చరణ్ సినిమా ఉంటే.. వాళ్లే అనౌన్స్ చేస్తారంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది.