
విటమిన్ C లోపం ఉన్నప్పుడు తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యల వేధిస్తూ ఉంటుంది. విటమిన్ C ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్, సంక్రమణల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను త్వరగా మరమ్మతు చేసి.. కొల్లాజెన్ పెరుగుదల కొరకు సహాయపడతాయి. విటమిన్ సీ వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు విటమిన్ Cతో నిండి ఉంటాయి.
అయితే, విటమిన్ C సప్లిమెంట్స్ తీసుకునే వారికి గాయాలు త్వరగా నయం అవుతాయి. ఇది కోలాజెన్ ప్రోటీన్‌కు సహాయం చేస్తుంది. దానివల్ల చర్మం మృదువుగా, సాఫ్ట్‌గా ఉండటానికి సహాయం చేస్తుంది. సరిపడా విటమిన్ C లేకపోతే, చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనిపిస్తుంటారు. కాబట్టి, మంచి చర్మం కావాలంటే విటమిన్ C అధికంగా ఉన్న పండ్లు, ఆహారాలను తప్పక సరిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
చర్మంలో విటమిన్ C లెవల్స్ తగ్గితే,చర్మం ఎర్రబడడం,రాషెస్ రావడం,నోటి చుట్టూ లేదా పెదవుల పై భాగంలో చర్మం డ్రై అవడం జరుగుతుంది. ఇది కూడా విటమిన్ C లోపం సంకేతంగా ఉండవచ్చు. ఈ విటమిన్ రక్త సరఫరా మెరుగ్గా ఉండటానికి సహాయం చేస్తుంది,తద్వారా గాయాలు త్వరగా చికిత్స పొందుతాయి.
విటమిన్ C లోపం ఉన్నప్పుడు, జుట్టు త్వరగా రాలటం, పొడిబారటం, పెలుసు అవడం, నిర్జీవంగా మారటం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. జుట్టు బలహీనమయ్యి ,రాలిపోతుంది. రెగ్యులర్‌గా జుట్టు పడుతున్నప్పుడు,విటమిన్ C లోపం ఉందని మీరు అనుమానించవచ్చు. చిగుళ్ల సమస్యలు, వాపులు, రక్తస్రావం వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి.
అంతేకాక, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి, దాంతో దంతాలు వదులుగా మారడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. దీనితో పాటు రక్తహీనత కూడా వచ్చి, రక్తంలో ఐరన్ అర్బ్జోర్ తక్కువగా జరుగుతుంది. ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది, అందువల్ల మనం నిరుత్సాహంగా, అలసిపోయినట్లుగా కనిపిస్తాము.