
IND vs ENG T20I Series: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య బుధవారం ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా కొంతమంది భారతీయ ఆటగాళ్లకు కీలక పరీక్షలా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ ఈ సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా టూర్లో ఆడిన టీ-20 సిరీస్‌లో కూడా ఎక్కువగా యువ ఆటగాళ్లే భారత జట్టులోకి వచ్చారు. టీ-20 ఇంటర్నేషనల్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఆడతారని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్ భారత టీ20 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ముగ్గురు యువ ఆటగాళ్లకు చివరి అవకాశం కూడా కావొచ్చు.
3. వాషింగ్టన్ సుందర్..
ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయడం ద్వారా, ఈ ఫార్మాట్లో అక్షర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం ఖాయం అని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. రవి బిష్ణోయ్ తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటివరకు చాలా బాగా రాణించాడు. అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించడం అంత సులభం కాదు. ఇప్పటికే ఇద్దరు స్పిన్నర్ల స్థానం జట్టులో ఖరారైతే.. వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ 11లో కొనసాగడం కష్టమే. సుందర్ జట్టులో కొనసాగాలంటే బంతితో పాటు బ్యాట్‌తో కూడా పటిష్ట ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
2. నితీష్ రెడ్డి..
గతేడాది బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్‌తో నితీశ్‌రెడ్డి అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ అతను ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అతనికి అక్కడ నిరంతర అవకాశాలు లభించాయి. రెండు ఫార్మాట్లలో శుభారంభం చేసిన నితీష్ అంతర్జాతీయ క్రికెట్లో తన స్థానాన్ని సంపాదించుకోగలనని నిరూపించాడు.
అయితే, రియాన్ పరాగ్ పునరాగమనం చేస్తే, నితీష్ జట్టులో కొనసాగడం కష్టం. ఎందుకంటే, హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఈ జట్టులో సభ్యుడు. నితీష్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవాలంటే లోయర్ ఆర్డర్ లో తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవాల్సి ఉంటుంది.
1. అభిషేక్ శర్మ..
టీ-20 ఇంటర్నేషనల్‌లో నిరంతరం ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ప్లేయింగ్ ఎలెవన్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించిన అభిషేక్‌కు పెద్దగా ఇన్నింగ్స్‌లు నిలకడగా ఆడలేకపోవడమే పెద్ద సమస్య. అభిషేక్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. కానీ, చాలా సందర్భాలలో అతను ఆ ప్రక్రియలో తన వికెట్ కూడా సమర్పించుకుంటుంటాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే గుణాన్ని కూడా తన బ్యాటింగ్‌లో తీసుకురావాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..