
వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. భారతీయులు ఎక్కువగా వంటింట్లో ఉపయోగించే పోపు దినుసులు, మసాలా దినుసులతో ఎన్నో అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. వంటింట్లో ఉండే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ఈ మెంతులతో ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
డయాబెటీస్ వచ్చిన వారు అయినా, డయాబెటీస్ రాకుండా కూడా మెంతులతో కంట్రోల్ చేసుకోవచ్చు. మెంతులు.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. మెంతుల్ని ఇలా తీసుకుంటే షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు.
మెంతుల్లో హైడ్రాక్సీసోలేయూసీనే అనే అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. దీంతో డయాబెటీస్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.
మెంతుల్ని ఒక గంట పాటు నీటిలో నానబెట్టి.. వాటిని ఉడికించి ఆ నీటిని తాగాలి. ఇలా ఈ నీటిని టీ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు.
ఈ నీరు తాగడం వల్ల ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తాయి. కొన్ని మెంతుల్ని పొడిలా చేసి.. వాటిని నీటిలో కలిపి తాగినా రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)