
15 డిసెంబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీ నగరంలోజన్మించింది అందాల తార నుపుర్ సనన్. ఈమె తండ్రి పేరు రాహుల్ సనన్ మరియు ఆమె తల్లి పేరు గీతా సనన్. తన హైస్కూల్ విద్య న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సంగీతంలో కోర్సు పూర్తి చేసింది.
2005లో యూట్యూబ్‌లో అద్భుతమైన పాటల రీమిక్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం. యూట్యూబ్‌లో ఆమె తొలి ప్రదర్శన 2005లో బెకరార్ కర్కే అనే పాట. ఆమె మనోహరమైన వాయిస్‌తో యూట్యూబ్‌లో హృదయాలను గెలుచుకుంది. తరువాత, ఆమె తేరే సాంగ్, హవాయెన్, జనమ్ జనమ్ మరియు లయన్ లాయన్ వంటి అనేక రకాల పాటలను ప్రదర్శించింది.
తన అద్భుతమైన స్వరం, ప్రదర్శనతో ప్రజలను మంత్రముగ్ధులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సరసన 2019 ఫిల్హాల్ మ్యూజిక్ వీడియోతో తెరపైకి అడుగుపెట్టింది. 2021లో అక్షయ్ కుమార్ తో ఫిల్హాల్ 2 వీడియోలో కనిపించింది.
2023లో రవితేజ సరస టైగర్ నాగేశ్వర్రావు అనే తెలుగు మాస్ యాక్షన్ బయోపిక్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది.
ప్రస్తుతం నూరానీ చెహ్రా అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా నటించే అవకాశం ఉంది.