
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో వేసవి రద్దీ కారణంగా తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడుతోంది. అన్యూహంగా పెరిగిన భక్తుల రద్దీ తో సాధారణ భక్తులకు టీటీడీ ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. సామాన్య భక్తులకు సర్వ దర్శనం కల్పించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా అమలు చేసి పరిశీలించనుంది. వచ్చే మే నెల నుంచి రెండున్నర నెలల పాటు పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు చేయాలని నిర్ణయించింది. వేసవి సెలవులతో రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటి నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేయాలని
టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసమే ఈ కీలక నిర్ణయాలను అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి శ్రీవారి దర్శనం బ్రేక్ దర్మనం కల్పించనుంది.
అదే విధంగా మే మొదటి నుండి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లోనూ మార్పులు తీసుకురానుంది. ప్రోటోకాల్ వీఐపీలకు… వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది. బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం ద్వారా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..