
నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తన కెరీర్లో బిగ్ నెంబర్స్‌ను టార్గెట్ చేస్తున్నారు నాని.
అందుకోసం గతంలో ఏ సినిమాకు చేయనంత యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3ని 60 కోట్ల బడ్జెట్‌తో స్వయంగా నిర్మించారు నాని.
ఆల్రెడీ ఆ సిరీస్ మీద ఉన్న నమ్మకం, నాని ఫామ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ బిగ్ నెంబర్స్ టచ్ చేసింది ఈ మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, ఓవరాల్‌గా 40 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.
హిట్ 3 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 70 కోట్ల వసూళ్లు సాధించాలి. అప్పుడే హిట్ 3.. హిట్ సెగ్మెంట్లోకి వస్తుంది. ప్రజెంట్ ఈ సినిమా మీద ఉన్న హైప్ చూస్తుంటే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్.
థియేట్రికల్ లెక్కలు పక్కన పెడితే ఓటీటీ బిజినెస్‌తో ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేశారు నాని. కేవలం ఓటీటీ కోసం 54 కోట్ల డీల్ సెట్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఆడియో, శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే హిట్ 3 ఓవరాల్‌గా వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టే అంటున్నారు బిజినెస్ అనలిస్ట్స్.