
ఈ రెండు ఘటనలూ ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయి. అలీగఢ్‌కు చెందిన మహిళ తన కూతురికి కాబోయే భర్తతో పరారైన ఘటన మరవకముందే, ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో దీనిని తలదన్నే ఘటన వెలుగులోకి వచ్చింది. మమత అనే 43 ఏళ్ల మహిళ తన కూతురి మామ శైలేంద్ర అలియాస్ బిల్లుతో పరారైంది. వివరాప్రకారం.. మమత భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే ఇంటికి వస్తుండేవాడు. ఈ మధ్యకాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్రను ఇంటికి పిలిపించుకునేదని, అతడితో సంబంధం కొనసాగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజులకోసారి శైలేంద్ర తమ ఇంటికి వచ్చేవాడని, దీంతో తాము రూమును మార్చుకోవాల్సి వచ్చేదని మమత కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి టెంపోలో పారిపోయారని తెలిపాడు. తాను కుటుంబ పోషణ కోసం బయటే ఎక్కువ గడపాల్సి వచ్చేదని, క్రమం తప్పకుండా భార్య మమతకు డబ్బులు పంపుతుండేవాడినని, అయితే ఆమె మాత్రం శైలేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. డబ్బు, బంగారంతో తీసుకొని అతనితో వెళ్లిపోయిందని వాపోయాడు. మహిళ పొరుగింటివారు కూడా సునీల్ ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదని, ఈ క్రమంలో శైలేంద్ర తరచూ మమత ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడని, బంధువు కావడంతో ఎవరూ అనుమానించలేదని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
Allu Arjun: వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..