
అలా డైరెక్టర్‌గా తన జర్నీని ఓ రేంజ్ కంటిన్యూ బాలీవుడ్ వరకు రీచైన ఈ డైరెక్టర్ ఎందుకో మునుపటి మ్యాజిక్ చేయలేకపోతున్నారు. సినిమాల నుంచి మధ్యలోనే తప్పుకోవడమో… లేక తన సినిమా రిలీజ్ చేయలేక వెయిటింగ్లో పెట్టడమో చేస్తున్నారు. ఫలితంగా తన ఫ్యాన్స్‌నే ఎలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎలా అయిపోయాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే.. పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ టైమ్‌కు రిలీజ్ చేస్తానంటే.. రిలీజ్ చేసేవాడు అంతే. అందులో ఒక్కరోజు కూడా ఆలస్యం ఉండేది కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత క్రిష్ సొంతం. చాలా వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారు అనే పేరు క్రిష్‌కు ఉంది ఇండస్ట్రీలో. అంతెందుకు హరిహర వీరమల్లు మొదలుపెట్టిన తర్వాత.. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనూ తక్కువ మంది టీంతో కొండపొలం సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేసారు క్రిష్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..