
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ సినిమా చిత్రీకరణలో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు కల్కి 2898 ఏడీ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇందులో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ పోషించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ అప్డేట్స్ వస్తుంటాయా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానులకు తాజాగా క్రేజీ ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి 2 రిలీజ్ డేట్ పై ఫన్నీ రిప్లై ఇచ్చారు. కల్కి 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగ్గా.. కల్కిని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశానని.. దాని సీక్వెల్ ను 7,8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు రిలీజ్ చేస్తానని అన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నాగ్ అశ్విన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కల్కి 2పై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
పార్ట్ 2లో ప్రభాస్ ఎక్కువసేపు స్క్రీన్ పై కనిపిస్తారని.. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్ లోనే కథ సాగుతుందని అన్నారు. రెండో భాగంలో వీరిద్దరి పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మరింత క్యూరియాసిటీ నెలకొంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..