
సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు పేదరికంలో జన్మించి ఇప్పుడు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారలలో కొందరు మాత్రమే తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి విరాళంగా ఇస్తున్నారు. నిజమైన హీరోలుగా ప్రజల మనసులలో స్థానం సంపాదించుకుంటున్నారు. అందులో ఈ సీనియర్ హీరో ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేశారు. అంతడు మరెవరో కాదు.. జాకీ ష్రాఫ్ గత 40 సంవత్సరాలుగా భారతీయ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ సహా మొత్తం 13 భాషలలో 250కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టేశారు.
ముంబైలోని డీన్ పట్టి వాల్కేశ్వర్ ప్రాంతంలో జన్మించిన జాకీ ష్రాఫ్ పెదరికంలోనే పెరిగాడు. అతడి కుటుంబం కేవలం ఒక్క గదిలోనే నివసించేవారు. తమ ఇళ్లు చాలా ఇరుకుగా ఉండేదని.. రాత్రిపూట ఎలుకలు తన చేతి వేళ్లను కొరికేవి అని.. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో 11వ తరగతిలోనే తాను చదువు మానేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జాకీ ష్రాఫ్. చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి ఎలాగైన ధనవంతుడు కావాలని కలలు కన్నాడట. వంటపని నుంచి సేల్స్ మాన్ వరకు దొరికిన ప్రతి పని చేశాడట. ఒకరోజు ఎవరో అతన్ని బస్ స్టాప్‌లో చూసి సినిమాలో పాత్ర పోషించమని చెప్పడంతో అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. సుభాష్ ఖై నటించిన ఆ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా అతడిని రాత్రికి రాత్రే బాలీవుడ్ స్టార్ గా మార్చారు.
కోట్లలో ఆదాయం ఉన్నప్పటికీ, జాకీ తాను ఎక్కడి నుండి వచ్చాడో ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పటికీ జాకీ ముంబైలో చాలా మంది పేదవాళ్లకు సాయం చేస్తుంటారు. దాదాపు 100 కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటాడు జాకీ. పేదల వైద్య ఖర్చులకు సాయం చేసేందుకు నానావతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక అకౌంట్ నిర్వహిస్తున్నాడు. తన ఆదాయంలో సగం పేదల కోసం ఖర్చు చేస్తాడు. ముంబైలోని ప్రతి బిచ్చగాడి దగ్గర జాకీ ష్రాఫ్ ఫోన్ నంబర్ ఉంటుంది. వీధి పిల్లలు ఆకలితో ఉంటే వారు ఎప్పుడైనా అతనికి ఫోన్ చేయవచ్చు. జాకీ వారికి ఆహారం ఏర్పాటు చేస్తారు. జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..