

ఒక నిర్మాణ రంగ సంస్థలో బీహార్‌కు చెందిన అంజద్ అలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే అలీ గత డిసెంబర్లో ప్రమాదానికి గురయ్యాడు. పొరపాటున క్రేన్‌లో చేతి పడటంతో మోచేతి వరకూ చేయి తెగి పడిపోయింది. వెంటనే అలీ చుట్టుముట్టిన తోటి కార్మికులు అతన్ని రక్షించి ఊడి పడిపోయిన చేతిని గోనె సంచిలో వేసుకొని వెంటనే గుంటూరులోని ఆదిత్య ఆసుపత్రికి వచ్చారు. రోగి పరిస్థితిని సమీక్షించిన ఆదిత్య ఆసుపత్రి ఎండి క్రిష్ణ స్రవంత్ అతనికి ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరానికే చెందిన ప్రముఖ ఆర్డోపెడిక్ వైద్యుడు బిందేష్తో చర్చించారు. మరో ఇద్దరూ డాక్టర్లు శిరిష్, యోగితో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. రోగికి వెంటనే శస్త్ర చికిత్స చేశారు. దాదాపు ఏడు, ఎనిమిది గంటల పాటు శ్రమించి ఆపరేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మరోసారి మార్చిలో ప్లాస్టిక్ సర్జరీ చేసి చర్మాన్ని అతికించారు. దాదాపు మూడు నెలల గడిచిన తర్వాత రోగి తన చేతి వేళ్లను కదిలిస్తుండటంతో ఆసుపత్రి వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
అత్యంత్య క్లిష్ణమైన ఆపరేషన్ ఛాలెంజ్ గా తీసుకొని చేసినట్లు క్రిష్ణ స్రవంత్ చెప్పారు. నగరంలోని నలుగురు డాక్టర్లు కలిసి ఒక బ్రుందంగా ఏర్పడటంతో శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేయగలిగినట్లు తెలిపారు. చేతులు, కాళ్లు తెగిపోయినప్పుడు వాటిని సెలైన్ బాటిల్ లేదా ఐస్ ప్యాక్ లో పెట్టుకొని వెంటనే ఆసుపత్రికి రావాలని ప్రముఖ ఆర్డోపెడిక్ సర్జన్ బిందేష్ చెప్పారు. నాలుగైదు గంటల్లో ఆసుపత్రికి చేరుకుంటే ఆ అవయవాలను తిరిగి అతికించే అవకాశం ఉంటుందన్నారు. అదునాతన పరికాలు అందుబాటులో ఉండటతో అలీ చేతిని తిరిగి అతికించడం సాధ్యమైందన్నారు. గుంటూరు నగరానికి చెందిన యువ వైద్యులంతా కలిసి విజయవంతంగా చేతిని తిరిగి అతికించడంతో వారిపై అలీ కుటుంబ సభ్యులు ప్రసంశలు కురిపించారు. గుంటూరులో అత్యంత్య ఖరీదైన ఆపరేషన్లను సమర్ధులైన వైద్యులు అతి తక్కువ ఖర్చుతోనే చేస్తున్నట్లు ఆదిత్య ఆసుపత్రి ఎండి క్రిష్ణ స్రవంత్ తెలిపారు.