
తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ.. ఆ తర్వాత చిత్రం.. మొన్నామధ్య అర్జున్ రెడ్డి.. నాలుగేళ్ళ కింద ఉప్పెన.. రెండేళ్ళ కింద బేబీ.. రిలీజ్‌కి ముందు ఏ సందడి ఉండదు.. కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు.
అందుకే అలాంటి సినిమాలకు రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువే. మన దగ్గర వర్కవుట్ అయిన సినిమాలు జెర్సీ, అల వైకుంఠపురములో, హిట్, ఆర్ఎక్స్ 100 బాలీవుడ్లో ఫ్లాపయ్యాయి.
కంటెంట్ బాగానే ఉన్నా.. అక్కడ తీసిన విధానం వర్కవుట్ అవ్వలేదు. ఎక్కడి వరకో ఎందుకు.. మొన్న విడుదలైన తెరీ రీమేక్ బేబీ జాన్ కూడా డిజాస్టరే. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం హిందీ రీమేక్‌పై చర్చ మొదలైంది.
నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చి వచ్చి భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సరిపోదా శనివారం. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్‌తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదొక్కటే కాదు.. ఉప్పెన, బేబీ సినిమాలు సైతం హిందీలో రీమేక్ అవుతున్నాయి. వీటిలో బేబీ బాలీవుడ్ కల్చర్‌కు సరిపోయేలా ఉన్నా.. ఉప్పెన మాత్రం చాలా రిస్కీ లైన్..! మరి చూడాలిక.. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో..?