
IPL 2025, Kavya Maran: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దడదడలాడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్‌తో కలిసి 60 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. మార్క్రమ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మార్క్రామ్ ఇప్పటివరకు 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన విషయానికొస్తే, ఈ మ్యాచ్‌కు ముందు లక్నో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. మార్క్రమ్ 2024 లో హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. కానీ, 2025 లో హైదరాబాద్ విడుదల చేసింది.
ఈ సీజన్లో మార్క్రామ్ ప్రదర్శన..
ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మార్క్రమ్ గత 6 ఇన్నింగ్స్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా లక్నో 5 మ్యాచ్‌లను గెలిచింది. దీంతో పాటు తన బౌలింగ్‌తో కూడా ప్రభావం చూపాడు మార్క్రమ్.
మార్క్రమ్ 9 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. జట్టుకు అవసరమైనప్పుడు మాత్రమే అతను బౌలింగ్ చేస్తూ, వికెట్లు తీసుకుంటాడు. ఐపీఎల్లో మార్క్రమ్ ప్రదర్శన గురించి చెప్పాలంటే, అతను ఇప్పటివరకు 53 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 51 ఇన్నింగ్స్‌లలో అతను 31.45 సగటుతో 1321 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2024లో మార్క్రామ్ స్థానంలో కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్..
గత సీజన్లో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఐడెన్ మార్క్రమ్ను తొలగించిన తర్వాత జట్టు యాజమాన్యం పాట్ కమ్మిన్స్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2023 సీజన్‌కు జట్టుకు నాయకత్వం వహించాల్సిన ఐడెన్ మార్క్రామ్ స్థానంలో జట్టు కమాండ్ బాధ్యతలను పాట్ కమ్మిన్స్‌కు యాజమాన్యం అప్పగించింది.
మర్క్రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఐపీఎల్ 2023లో చాలా పేలవమైన ప్రదర్శన చేసింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. హైదరాబాద్ జట్టు 10వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ వేలంలో మర్క్రమ్ను విడుదల చేసింది. ఆ తర్వాత, మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..