
అమరావతి, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78 శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు.
ఏపీ పదో తరగతి 2025 పబ్లిక్ పరీక్షల ఫలితాలు
పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తే.. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 93.90 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఇక పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు వచ్చిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్ధులు ఏప్రిల్ 24, 2025వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో మే1 నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు కూడా అవకాశం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
తక్కువ మార్కులు వచ్చాయనీ, ఫెయిల్ అయ్యామని విద్యార్ధులు ఎలాంటి దారుణాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని, సప్లిమెంటరీ పరీక్షలు రాసి కూడా పాస్ అవొచ్చని సూచించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు వారిపై ఓ కన్నేసి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.