

భారతీయ సినీరంగంలో 90’s లో వరుస హిట్స్ అందుకున్న హీరోయిన్లలో కాజోల్ ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది కాజోల్. ఇదిలా ఉంటే.. తాజాగా కాజోల్ తన కూతురి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాజోల్ కూతురి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. నైసా అచ్చం తన తల్లిలాగే ఉందని.. తన తల్లికి బ్లూప్రింట్ మాదిరిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైసార్ , కాజోల్ ఇద్దరు అక్కాచెల్లెల్లుగా కనిపిస్తున్నారని.. వాళ్లిద్దరూ ఒకేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైసార్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె సోషల్ మీడియాలో ఫోటోస్ చూస్తుంటే త్వరలోనే సినీరంగంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం కాజోల్ తన కూతురు సినీరంగ ప్రవేశం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కూతురికి ఆసక్తి ఉంటే ఇండస్ట్రీలోకి వస్తుందని తెలిపింది.
కానీ తన కూతురికి సినీ ప్రవేశం గురించి ఎలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపింది. కాజోల్, అజయ్ దేవగన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోహీరోయిన్స్. వీరిద్దరు కలిసి గతంలో అనేక చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన వీఐపీ చిత్రంలో కాజోల్ విలన్ పాత్రలో అదరగొట్టింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..