
ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతోపాటు అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇన్నాళ్లు దక్షిణాదిలో అలరించిన ఆమె ఇప్పుడు నార్త్ షిఫ్ట్ అయ్యింది. ఇటీవలే హిందీలో ఓ సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. సినిమాలతోనే కాకుండా ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది ఈ అమ్మడు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రభాస్, రజినీకాంత్, అజిత్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం నయనతారతెలుగులో అంతగా యాక్టివ్ గా లేదు.. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం నయనతార విలాసవంతమైన జీవనశైలి, ఆస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.
నయనతార తన కెరీర్ను 2003లో ప్రారంభించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంటుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.223 కోట్లు అని తెలుస్తోంది. అలాగే మ్యాజిక్ బ్రిక్స్ డాట్ కామ్ ప్రకారం ఆమెకు హైదరాబాద్, చెన్నై, కేరళతో సహా పలు నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. కేరళలలో ఆమె పూర్వీకుల ఇల్లు ఉందని.. అది అత్యంత విలాసవంతమైన ఆస్తులలో ఒకటి అని సమాచారం. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారి ఇద్దరు కవలలు జన్మించారు. ప్రస్తుతం నయనతార తన భర్త, పిల్లలతో కలిసి చెన్నైలోని విలాసవంతమైన ఇంటిలో నివసిస్తుంది. ఈ భవనం విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. అలాగే ముంబైలో సముద్రం తీరానికి దగ్గర్లో ఓ ఇల్లు కొనుగోలు చేసింది.
కొన్నేళ్ల క్రితం నయన్ సొంతంగా ప్రైవేట్ జెట్ తీసుకుంది. అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున వంటి అతి కొద్ది మంది సెలబ్రెటీలు వద్ద మాత్రమే ఉన్న ప్రైవేట్ జెట్ ఇప్పుడు నయనతార దగ్గర కూడా ఉంది. అలాగే ఆమె దగ్గర BMW 5 S, మెర్సిడెస్ GLS 350 D, ఫోర్డ్ ఎండీవర్, BMW 7 సిరీస్, ఇన్నోవా క్రిస్టా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. నయనతార కార్ల కలెక్షన్లో విఘ్నేష్ శివన్ బహుమతిగా ఇచ్చిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కూడా ఉంది. తన భర్తతో కలిసి 2021లో రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ కంపెనీ ఆస్తులు దాదాపు రూ.50 కోట్లు. అలాగే 2019లో ది లిప్ బామ్ కంపెనీని స్టార్ట్ చేసింది. సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..