

ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే నవ్వొస్తుంది.. కానీ ఇవే ఘటనలు కొందరిని బాధపడేలా చేస్తుంది. కాబోయే అల్లుడితో పెళ్లికి ముందు ఓ మహిళ లేచిపోయిన ఘటన ఇటీవలే మనం చూశాం.. కానీ ఇప్పుడు జరిగిన ఘటన గురించి తెలిస్తే..ఫస్ట్ మీరు నవ్వుకోవచ్చు…కానీ తర్వాత కచ్చితంగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో సంతోషించాడు. తీర పెళ్లయ్యాక వధువును చూసి కంగుతిన్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది. వధువు ప్లేస్‌లో ఉన్నది ఎవరూ..పెళ్లి కొడుకు ఎందుకు షాక్ కావాల్సి వచ్చింది. ఇంతకీ అతడికి జరిగిన మోసం ఏంటో తెలుసుకుందాం పదండి…
పోలీసుల వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్ మీరట్‌లోని బ్రహ్మపురికి చెందిన మహ్మద్ అజీమ్ (22) అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు షామ్లి జిల్లాకు చెందిన మంతాషా అనే ఓ యువతితో పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి కుదరడంతో పెళ్లి కూతురు అన్న నదీమ్, వదిన షాయెదా కీలక పాత్ర పోషించారు. అంతా ఓకే అనుకున్నాక మార్చి 31వ తేదీన పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. అనుకున్న ప్రకారం అదే తీదీన పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లి అంతా బాగానే జరిగింది. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత పెళ్లికొడుకు అజీమ్ పెళ్లి కూతరు పరదా తెరిచి చూశాడు. పరదా వెనక ఉన్న పెళ్లి కూతురును చూసి షాక్ అయ్యాడు. మంతాషా ఉండాల్సిన స్థానంలో ఆమె తల్లి ఉంది. అక్కడ పిల్ల బదులు పిల్ల తల్లి ఉండటాన్ని చూసిన అజీమ్ కంగుతిన్నాడు.
ఇదేంటని పెళ్లి కూతురు తరపు బంధువులను నిలదీశాడు. దీంతో నువ్వు ఆమెతోనే కాపురం చేయాలి లేదంటే నీపై రేప్ కేసు పెట్టి జైల్లో వేయిస్తాం అని మంతాషా అన్న వదినలు నదీమ్, షాయోదా అజీమ్‌ను బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. దీంతో ఏమీ చేయలేక కొన్నాళ్ల పాటు వారి వేధింపులు మౌనంగా భరించిన అజీమ్..ఇక తన వల్ల కాదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు చెప్పాడు. మంతాషా అన్న వదినలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి సందర్భంగా 5 లక్షల రూపాయలు చేతులు మారాయని. తనకు పిల్లతో పెళ్లని చెప్పి..పిల్ల బదులు ఆమె తల్లితో పెళ్లి చేశారని వాపోయాడు. ఆ మోసాన్ని ప్రశ్నించిన నాపై వాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. బాధితుడి బాధను అర్థం చేసుకున్న పోలీసులు రెండు వర్గాలను పిలిపించి సెటిల్మెంట్ జరిపించినట్టు తెలుస్తోంది. దీంతో అజీమ్ కేసు విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..