
క్యూఆర్ కోడ్. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్ మ్యాన్ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూ ఆర్ కీలకం అయిపోంది. ఫోన్ కెమెరాతో స్కాన్ చేయడం.. పేమెంట్ చేసేయడం.. సెలెబ్రిటీలు కన్ఫర్మ్ చేయడం.. అంతా బాగానే ఉంది. కానీ, ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? కన్ఫ్యూజన్గా కనిపించే ఈ క్యూఆర్ కోడ్‌ని ఎవరైనా మార్చేస్తే? స్కాన్ చేయగానే సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కితే? బ్యాంక్ ఖాతా అంతా ఖాళీ అయితే..’ అప్పుడు పరిస్థితి ఏంటి? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డూప్లికేట్ క్యూఆర్ కోడ్లు సృష్టిస్తున్నారు. కస్టమర్ల ఫోన్లలోకి మాల్వేర్ జొప్పిస్తున్నారు. అచ్చంగా అసలైన కోడ్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయిన మాల్వేర్ – వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరిస్తుంది. అయితే ఇక్కడే కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే, మోసపోకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్స్‌కు సంబంధించి ఏది కరెక్ట్, ఏది ఫేక్ అన్నది తెలియకపోవడం ప్రధాన సమస్య. చాలా చోట్ల క్యూఆర్ కోడ్స్ ఇప్పుడు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్కింగ్ ఫీజు వసూలు చేసే చోట ఉండే క్యూఆర్ కోడ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అంతగా పట్టించుకోరు. అక్కడ స్కామర్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. అదేవిధంగా వర్చువల్ మెనూ కార్డ్‌ను స్కాన్ చేసినప్పుడు అక్కడ సైబర్ క్రిమినల్స్ రియల్ కోడ్‌ని రీప్లేస్ చేయగలుగుతారు. అదేవిధంగా పే చేయాల్సిన బిల్లుల విషయంలోనూ మోసాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??
మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు.. గుర్తించడం ఎలా?