
తెలుగు సినిమా చరిత్రలో సౌందర్య పేరు ఎప్పటికీ చెరిగిపోదు. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే కట్టుబొట్టు, సహజ సౌందర్య, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో నటించాలని ఎదురుచూసేవారు.. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది సౌందర్య. సౌందర్య 1992లో తెలుగు చిత్రం “మనవరాలి పెళ్లి”తో తన సినీ కెరీర్ మొదలుపెట్టాడు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..
“అమ్మోరు”, “పవిత్ర బంధం”, “రాజా”, “అన్నయ్య”,”దొంగాట” వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. “అమ్మోరు” చిత్రంలో నటనకు ఎన్నో అవార్డులు అందుకుంది సౌందర్య. ఇది ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. 2004లో పొలిటికల్ క్యాంపెయిన్ కు వెళ్తున్న సమయంలో సౌందర్య మరణించింది. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఆమె మరణించారు. అయితే సౌందర్య ఓ తెలుగు హీరోను ఇష్టపడిందన్న విషయం మీకు తెలుసా.?
ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్
గతంలో ఓ ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో సౌందర్య ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ తో నటించింది. అయితే వెంకటేష్‌తో ఎక్కువగా సినిమాలు చేశారు సౌందర్య. అప్పట్లో ఈ ఇద్దరూ ఇష్టపడుతున్నారని రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు అని సౌందర్య మ్యాకప్ మెన్ రాఘవ తెలిపారు. సౌందర్య అందరితో ఎంతో గౌరవంగా ఉంటారు. వెంకటేష్ ను ఆమె సార్ అని పిలిచేవారు అని రాఘవ తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.