
సూర్యభగవానుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం సూర్యుడు ప్రతి నెలలో తన రాశిని మార్చుకుంటాడు. జూన్ 2025లో సూర్యుడు తన మిత్ర గ్రహం బుధుడుకి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు మిత్ర గ్రహంలోకి ప్రవేశించడం వల్ల ఈ సంచారంతో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలుగుతుంది. వీరు చేపట్టిన ప్రతి పనులలో విజయం సాధిస్తారు. అంతేకాదు వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం కూడా పెరుగుతుంది.
సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే సమయం ఇది.
జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు జూన్ 15, 2025 ఆదివారం ఉదయం 06:52 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు.
ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందంటే
సింహ రాశి: ఈ రాశికి అధిపతి సూర్యుడు. దీంతో సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించడంతో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెల రోజులు సింహ రాశివారు పట్టిందల్లా బంగారమే. వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరు తమ పిల్లలకు సంబంధించిన శుభ వార్తలు వినే అవకాశం ఉంది. మీరు బంధువులు , పాత స్నేహితులను కలవవచ్చు.
ఇవి కూడా చదవండి
కన్య రాశి: ఈ రాశి వారికి నిద్రాణస్థితిలో ఉన్న అదృష్టం.. సూర్యుడు మిథున రాశిలో సంచరించడం వల్ల మేల్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కెరీర్లో పురోగతి సాధిస్తారు. తండ్రికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. దీనితో పాటు.. వీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవలసి ఉంటుంది. దీనితో పాటు.. ఉద్యోగం చేయడం ద్వారా వ్యక్తి పదోన్నతి, కోరుకున్న ప్రదేశానికి బదిలీ కూడా పొందవచ్చు, ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాదు వ్యాపారంలో వీరి కష్టానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.
తులా రాశి: సూర్య భగవానుడి రాశిలో మార్పు తులా రాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. విద్యార్థులు పరీక్షలు , పోటీలలో విజయం సాధించే అవకాశం ఉంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు కుటుంబంతో సంబంధాలు మరింత మెరుగవుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు