
Royal Challengers Bengaluru vs Punjab Kings, 34th Match Result: ఐపీఎల్ (IPL) 2025లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు అందించిన 96 పరుగుల లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. నెహాల్ వధేరా 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్కస్ స్టోయినిస్ సిక్స్ కొట్టడం ద్వారా మ్యాచ్‌ను ముగించాడు. కాగా, మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. వర్షం ఎఫెక్ట్‌తో మ్యాచ్ 7:30కి బదులుగా 9:45కి ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ 14-14తో ముగిసింది.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు తొమ్మిది వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. టిమ్ డేవిడ్ అజేయంగా 50 పరుగులతో బెంగళూరు పరువు కాపాడాడు. పంజాబ్ తరపున అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో సొంతగడ్డపై ఆర్సీబీకి ఇది వరుసగా మూడో ఓటమి. పంజాబ్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదవ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో పంజాబ్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. కాగా, ఆర్సీబీ నాల్గవ స్థానానికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా
RCB vs PBKS మ్యాచ్‌లో హీరోగా ఎవరంటే?
ఆర్సీబీ బ్యాటింగ్‌లో టిమ్ డేవిడ్ అజేయంగా 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి హీరోగా మారాడు. అతను 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ 10 పరుగులకు 2 వికెట్లు పడగొట్టగా, యుజ్వేంద్ర చాహల్ 11 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో నేహాల్ 33 పరుగులతో హీరోగా నిలిచాడు. జోష్ హాజిల్‌వుడ్ 14 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ బౌలింగ్‌లో ఆధిపత్యం చెలాయించాడు.
తడబడుతూనే పంజాబ్ కింగ్స్ ఛేజింగ్..
లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (13), ప్రియాంష్ ఆర్య (16), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ 2 ఫోర్లతో 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నెహాల్ వధేరా సుయాష్ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టడం ద్వారా పంజాబ్‌ను లక్ష్యాన్ని చేరుకునేలా చేశాడు.
ఇది కూడా చదవండి: నాడు బ్రహ్మ రాతను మార్చాడు.. నేడు విధి రాతకు బలయ్యాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే మోస్ట్ ఫ్లాప్ ప్లేయర్‌గా
వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో తడబడిన బెంగళూరు..
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్ పంజాబ్ బౌలింగ్ కు పూర్తిగా లొంగిపోయింది. అర్ష్‌దీప్ సింగ్ వరుసగా రెండు ఓవర్లలో ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లీ (1)లను అవుట్ చేశాడు. జితేష్ శర్మ (4)ను చాహల్, కృనాల్ పాండ్యను జాన్సన్ అవుట్ చేశాడు. ఐదుగురు బ్యాట్స్మెన్లలో నలుగురు షార్ట్ పిచ్ బంతుల్లోనే ఔటయ్యారు. కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 23 పరుగులు చేశాడు. కానీ, అతను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఆర్సీబీ 41 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయింది. మనోజ్ భనగే తన ఐపీఎల్ అరంగేట్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. ఈ విధంగా, 42 పరుగులకే ఏడు వికెట్లు పడిపోయాయి. అయితే, బెంగళూరు 49 పరుగులకే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడింది.
ఏడో స్థానంలో, డేవిడ్ ఒంటి చేత్తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును 95 పరుగులకు చేర్చాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతిని వరుసగా 3 సిక్సర్లు బాది, చివరి బంతికి రెండు పరుగులు తీసి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్లో అతని తొలి అర్ధ సెంచరీగా నిలిచింది. పంజాబ్ తరపున జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ తీసుకోగా, మిగిలిన నలుగురు బౌలర్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాన్సెన్ 10 పరుగులకు 2 వికెట్లు పడగొట్టగా, చాహల్ 11 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..