
తెలుగునాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మాములుగా లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తనయుడు.. జయ జానకి నాయక సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. మొన్నామధ్య బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు భైరవం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే తమిళ్ సినిమా రాట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా అతడి కెరీర్లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకులు ప్రశంసలు అందుకుంది. కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన పాప గుర్తుందా..?
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
ఆ పాప చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది. తన పేరు అభిరామి. రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. అంతే కాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది. విద్యా సాగర్ రాజు డైరెక్ట్ చేసిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) మూవీలో నటించింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఇంతలోనే హీరోయిన్ అయిపోయింది. మణిరత్నం తెరకెక్కించిన “నవరస” వెబ్ సిరీస్ అభిరామి నటించింది. ఈ చిన్నది తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలు, సినిమా అప్డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.