
ఆలయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో కొబ్బరికాయ కొడితే వచ్చే శబ్దం శుభ సూచనగా పరిగణించబడుతుంది. ఆ శబ్దం ద్వారా మన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, శుభ పరిణామాలు సంభవిస్తాయని నమ్మకం ఉంది. కొబ్బరికాయ అంటే పాపాల వినాశనానికి ప్రతీక. అందుకే అది పగలగొట్టేటప్పుడు వచ్చిన మార్పులు దైవ సంకేతంగా భావిస్తారు. ఈ విశ్వాసాలు మన సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలను ఆశించే వారికి మార్గనిర్దేశంగా నిలుస్తాయి.
కొబ్బరికాయ విరిగిన విధానాన్ని బట్టి శుభాశుభాలు
- కొబ్బరికాయ చిన్న ముక్కలుగా గుండ్రంగా పగిలితే ధనం పెరుగుతుంది.
- ఐదు భాగాలుగా విరిగితే స్థిరమైన ధనం వస్తుంది.
- సమానంగా విరిగితే కష్టాలు తొలగి ధనం పెరుగుతుంది.
- మూడింట ఒక భాగంలా విరిగితే రత్నం లభించే అవకాశం ఉంటుంది.
- పెంకు ఒంటరిగా పడితే దుఃఖం కలుగుతుంది.
- పిడికిలోంచి జారి పడితే కుటుంబంలో దుఃఖం, ధననష్టం జరుగుతాయి.
- పొడవుగా విరిగితే ధనం పోతుంది.. కష్టాలు వస్తాయి.
- రెండు ముక్కలుగా విరిగితే అగ్ని వల్ల నష్టం జరుగుతుంది.
- రెండు ముక్కలతో పాటు చిప్ప కూడా వెంటనే పడితే వ్యాధులు కలగవచ్చు.
- చిన్న ముక్కలుగా విరిగితే ధనం, ప్రభావం, ఆభరణాల లాభం వస్తుంది.
- దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో కొబ్బరికాయ పగలగొట్టిన శబ్దం వినిపిస్తే.. మీరు కోరుకున్న పని నెరవేరే సూచనగా భావిస్తారు.
కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అది సరిగా విరగకపోవచ్చు లేదా లోపల కుళ్ళిపోయి ఉండొచ్చు. దీని వల్ల కొందరికి నిరాశ కలగవచ్చు. కానీ ప్రతి సారి శకునాలు వెతకాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ లోపల పువ్వు ఉంటే.. మీరు కోరిన కోరిక నెరవేరే సూచనగా తీసుకోవచ్చు. ఇది శుభంగా భావించబడుతుంది.
కొబ్బరికాయ ఆకారం ఆధారంగా ఫలితాలు.. కన్ను భాగం చిన్నగా, కింద భాగం పెద్దగా ఉండి పగలగొడితే కుటుంబ సమస్యలు తొలగి శాంతి వస్తుంది. కనుపాప భాగం పెద్దదిగా ఉండి కింది భాగం చిన్నగా ఉంటే ఇంట్లో ధనం పెరుగుతుంది. ఈ విధంగా ఆకారం కూడా శుభ, అనుకూల ఫలితాలను సూచించగలదు.
కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు ఓపికతో ఉండాలి. తొందరపడి చేయకూడదు. పూజ కోసం కొన్న కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటే.. దాన్ని వదిలేసి మరోటి కొని పగలగొట్టాలి. ఇది చెడు శకునం కాదు. భక్తితో నిండిన మనసుతో శ్రద్ధగా చేసిన పనికి తప్పకుండా ఫలితం ఉంటుంది.
ఇంట్లో పూజ కోసం కొబ్బరికాయ కొంటే ఒకటి కాక రెండు కొనడం మంచిది. ఒకటి కుళ్ళిపోయినా మరొకటి ఉపయోగించవచ్చు. తద్వారా సమయానికి పూజ చేయవచ్చు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)