
సమ్మర్ పూర్తయేవరకూ రాజాసాబ్‌కి సంబంధించిన కలలు తరుముతూనే ఉంటాయి డార్లింగ్ ఫ్యాన్స్‌ని. అదిగో ఇదిగో అంటూ అంతగా ఊరిస్తోంది ఆ సినిమా. ఈ జోనర్లో ప్రభాస్‌ని చూసి జనాలు తప్పక థ్రిల్ ఫీలవుతారన్నది మారుతి చెబుతున్న మాట.
వీటన్నిటితో సంబంధం లేకుండా ఫౌజీతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఫౌజీలో ప్రతి విఫయం డార్లింగ్‌కి వావ్ ఫ్యాక్టరేనట. అంతగా మెస్మరైజ్ చేశారు కాబట్టే హను రాఘవపూడికి ఇమీడియేట్‌గా ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట యంగ్ రెబల్‌స్టార్.
ఈ సినిమా తర్వాత అంటే.. దాదాపు ఇయర్ ఎండింగ్‌కి బాగా పరిచయం ఉన్న నాగ్ అశ్విన్ కల్కి2 సెట్స్ లో వాలిపోతారు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ 70 శాతం ముందే కంప్లీట్ అయినట్టు ఓ సందర్భంలో అన్నారు నిర్మాత అశ్వినీ దత్.
సేమ్ టు సేమ్ కాకపోయినా, ఆల్మోస్ట్ ఇలాగే ఉంది తారక్ కెరీర్. తారక్ వార్2 కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు అతి త్వరలోనే నీల్ సినిమా షూటింగ్‌కి హాజరుకాబోతున్నారు తారక్. జనాలు వెయిట్ చేస్తున్న ఫ్రెష్ కాంబో ఇది.
ఇయర్ ఎండ్‌కి వచ్చేసరికి తనకు బాగా పరిచయమైన కొరటాల శివ సెట్‌కి వెళ్తారు తారక్. సో ఈ ఏడాది ఆఖరులో బాగా పరిచయమైన టీమ్స్ తో వర్క్ నీ, ఫన్నీ ఆస్వాదించడానికి రెడీ అవుతున్నారు ఇద్దరు ప్యాన్ ఇండియా హీరోలు.