
టాలీవుడ్ స్క్రీన్ మీద మైల్స్టోన్ లాంటి మూవీ అర్జున్ రెడ్డి. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్ ఫార్ములాస్ను బ్రేక్ చేసిన మూవీ అది. మ్యూజికల్‌గానూ అర్జున్ రెడ్డి ఓ సెన్సేషన్. ఆ ఆల్బమ్‌లో ప్రతీ పాట ఓ సూపర్ హిట్. అయితే ఇంత మంచి అవుట్ పుట్ ఇచ్చిన దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఆ సినిమా మళ్లీ కలవలేనంత గ్యాప్ క్రియేట్ చేసింది.
అర్జున్ రెడ్డి రిలీజ్ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ రథన్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. మ్యూజిక్ ఇచ్చే విషయంలో రథన్ చాలా డిలే చేశాడని, ఫోన్ అటెండ్ చేయకుండా ఇబ్బంది పెట్టేవాడని, ఒక దశలో సినిమా వదిలేస్తే ఏం చేస్తావని బెదిరించాడని చెప్పారు. అందుకే అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ రథన్లో వర్క్ చేయలేదు సందీప్.
ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న రథన్ తన నెక్ట్స్ మూవీ ప్రమోషన్లో మీడియా కంటపడ్డారు. దీంతో సందీప్‌తో వివాదం విషయంలో స్పందించక తప్పలేదు. అయితే ఈ విషయంలో చాలా హుందా రియాక్ట్ అయ్యారు ఈ మ్యూజిషన్.
సందీప్‌కు తనకు తండ్రిలాంటి వాడని,ఓ మంచి అవకాశం ఇచ్చాడని, తండ్రి కోప్పడితే కోడుకు బాధపడకూడదని అన్నారు. సందీప్ అవకాశం ఇవ్వటం వల్లే అర్జున్ రెడ్డి లాంటి మంచి ఆల్బమ్ వచ్చింది అన్నారు.
రథన్ రియాక్షన్‌తో అర్జున్ రెడ్డి వివాదానికి ఫుల్స్టాప్ పడినట్టైంది. అర్జున్ రెడ్డి సక్సెస్ వల్లే తనకు హుషారు, జాతిరత్నాలు లాంటి సినిమాల్లో అవకాశం వచ్చిందన్నారు. ఆ ఇమేజే ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా అవకాశం కూడా తెచ్చిపెట్టింది అని గుర్తు చేసుకున్నారు.