
విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయుల సమావేశంలో ప్రసంగించిన జనరల్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న వారంత దేశ రాయబారులని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఆయన అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. దేశంతో వారి బంధం బలహీనపడకుండా ఉండేందుకు మీ పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను తెలియజేయాలన్నారు. హిందువులతో పోలిస్తే.. తాము భిన్నమైన వారని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయని తెలిపారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అసిమ్ మునీర్ అన్నారు.
Pakistan Army Chief General Asim Munir spews hate against #Hindus and propagates the #TwoNationTheory, which failed in 1971 when Bangladesh got independence from Pakistan. He asserts that children must be taught such “falsehoods” since it’s easier to brainwash youth. Shameful! pic.twitter.com/vaVZhEK4v8
— Taha Siddiqui (@TahaSSiddiqui) April 16, 2025
ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు. 13 లక్షల భారత సైనికులే పాకిస్థాన్‌ను భయపెట్టలేకపోయారని, అలాంటప్పుడు ఈ ఉగ్రవాదులు ఏం చేయగలరని అన్నారు. బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్థాన్ తన మద్దతును కొనసాగిస్తుందని, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….