
మన కుటుంబ సభ్యులు, ఆప్తులు మరణిస్తే చాలా బాధ పడతాం. వారితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాల గుర్తుకు తెచ్చుకుని.. ఆ బాధతో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాం. కొందరిని మరిచిపోలేని మమకారం ఉంటుంది. తాజాగా ఓ గ్రామంలో ఆంబోతు మరణిస్తే ఊరంతా కదిలింది. ఆంబోతు మృతిని తట్టుకోలేక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. గ్రామస్తులు మొత్తం తరలివచ్చి, ఆంబోతుకు ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ గ్రామస్థులు తో అంతగా అనుబంధం ఉంది.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ళపెంట గ్రామంలో ఆంబోతు ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామస్తులు దైవంగా భావించే ఆంబోతు ఎద్దు ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందటంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊరంతా ఏకమై తమతో మమేకమైన ఆంబోతు ఎద్దుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రాక్టర్ ట్రక్కు పైకి ఆంబోతు మృతదేహాన్ని చేర్చి పసుపు కుంకుమ చల్లి ఊరంతా కలియ తిరుగూతూ మేళ తాళాలతో టపాసులు పేల్చుతూ అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు గ్రామస్తులు దేవుడి స్వరూపంగా భావించే ఆంబోతు ఎద్దు అంతుమ యాత్రలో పాల్గొని కన్నీటి పర్వతం అయ్యారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..