
కర్ణాటక కాబిని (Kabini) అడవుల్లో నల్లటి పెద్ద పులులు (Black panther) ఉంటాయి. వాటిని అడవి దెయ్యం అని కూడా అంటారు. అవి నల్లగా ఉండటం వల్ల నీడల్లో కలిసిపోయినట్టు ఉంటాయి. అందుకే వాటిని చూడడానికి వన్యప్రాణుల ప్రేమికులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక్కడ చిరుతలు, ఏనుగులు, వైల్డ్ డాగ్స్ కూడా మీరు చూడొచ్చు.
పశ్చిమ బెంగాల్ సింగలీలా నేషనల్ పార్క్ (Singalila National Park)లో రెడ్ పాండాలు కనిపిస్తాయి. చూడటానికి ఎంతో ముద్దు ముద్దుగా కనిపించే ఈ రెడ్ పాండాలు చెట్లపై నివసిస్తాయి. 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో హిమాలయ పర్వతాల అందాలను ఆస్వాదించడమేగాక.. ఈ అరుదైన రెడ్ పాండాలను కూడా చూడవచ్చు.
బీహార్ విక్రమశీలా గాంగెటిక్ డాల్ఫిన్ శ్యాంక్చురీ (Vikramshila Gangetic Dolphin Sanctuary)లో డాల్ఫిన్లు నివసిస్తాయి. విక్రమ్ శిల అభయారణ్యంలో పడవలో తిరుగుతూ ఈ డాల్ఫిన్లను చూడొచ్చు. ఇవి కళ్లు కనబడకుండా గుడ్డిగా ఉంటాయి. కానీ శబ్దాలు చేసి వాటి దారిని తెలుసుకుంటాయి. దాన్ని ఎకోలొకేషన్ అంటారు.
అస్సాంలోని హూలోంగపర్ గిబ్బన్ అభయారణ్యం (Hoollongapar Gibbon Sanctuary)లో హూలాక్ గిబ్బన్ లు నివసిస్తాయి. ఇవి చెట్ల మీద ఊగుతూ ఒక రకమైన ప్రత్యేకమైన శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలతో గాలి నిండిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ స్టంప్ టెయిల్డ్ మకాక్లు (stump tailed macaques), స్లో లోరైస్‌లు ( slow lorises) కూడా మీకు కనిపిస్తాయి.
రాజస్థాన్‌లోని ఎడారి జాతీయ ఉద్యానవనం (Desert National Park)లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (Great Indian Bustard) పక్షులు నివసిస్తాయి. ఇవి ప్రపంచంలోని అత్యంత బరువైన ఎగిరే పక్షులలో ఒకటి. అంతరించిపోతున్న ఈ పక్షులను చూడటం పక్షులను ఇష్టపడే వాళ్లకు చాలా ప్రత్యేకమైన అనుభవం.
తమిళనాడు మన్నార్ గల్ఫ్‌లో డుగోంగ్ (Dugong)లు నివసిస్తాయి. వీటిని సముద్ర ఆవులు అని కూడా అంటారు. స్నార్కెలింగ్ చేస్తూ లేదా పడవలో తిరుగుతూ వీటిని మనం చూడొచ్చు. ఇక్కడ మీకు పగడపు దిబ్బలు, డాల్ఫిన్లు కూడా కనిపిస్తాయి.
లడఖ్‌లోని హెమిస్ నేషనల్ పార్క్ (Hemis National Park) లో మంచు చిరుతలు నివసిస్తాయి. ఇవి మంచుతో కప్పబడిన పర్వతాలలో తిరుగుతాయి. వాటిని చూడాలంటే చాలా ఓపిక, ధైర్యం ఉండాలి. ఒక రకంగా ఇది పరీక్ష లాంటిదే అని చెప్పాలి.
గుజరాత్ వెలవాదర్ నేషనల్ పార్క్ (Velavadar National Park)లో భారతీయ తోడేళ్ళు నివసిస్తాయి. ఇవి చిన్నగా, అందంగా ఉంటాయి. రాత్రిపూట చేసే సఫారీలో వీటిని మీరు చూడొచ్చు.
ఒడిశా గహిర్మాత బీచ్ (Gahirmatha Beach)లో ఆలివ్ రైడ్లీ సముద్ర తాబేళ్లు (Olive ridley sea turtles) లను మీరు చూడొచ్చు. ప్రతి సంవత్సరం వేలాది ఆలివ్ రైడ్లీ తాబేళ్లు ఒడిశా బీచ్‌లకు గూడు కోసం వస్తాయి. చంద్రుని వెన్నెల్లో పిల్ల తాబేళ్లు గుడ్ల నుంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్తుండడం మీరు చూడొచ్చు. నవంబర్ నెల నుంచి మార్చి వరకు ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు.
మహారాష్ట్ర రాధానగరి వన్యప్రాణుల అభయారణ్యం (Radhanagari Wildlife Sanctuary)లో బైసన్ (Bison)లు నివసిస్తాయి. ఇవి బలమైన శరీర నిర్మాణం కలిగిన భారీ జంతువులు. అలాగే ఈ ప్రాంతంలో హార్న్బిల్స్ (hornbills), ఫ్లై క్యాచర్స్ (flycatchers), ఈగల్స్ (eagles) వంటి పక్షులను కూడా మీరు చూడొచ్చు.