
వేగవంతంగా, చల్లని గాలిని అందించడం ఆటెంబర్గ్ రెనెసా పెడెస్టల్ ఫ్యాన్ ప్రత్యేకత. దీనిలోని బీఎల్డీసీ మోటారుతో పనితీరు సూపర్ గా ఉంటుంది. కేవలం 35 డబ్ల్యూ శక్తిని మాత్రమే వినియోగించుకుని విద్యుత్ ఖర్చును బాగా తగ్గిస్తుంది. సిక్స్ స్పీడ్ సెట్టింగ్ లు, రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, అసిలేషన్ మోడ్, ఎల్ఈడీ స్పీడ్ ఇండికేటర్ బాగున్నాయి. బెడ్ రూమ్, లివింగ్ రూమ్, ఆఫీసు.. ఇలా అన్నిచోట్లా చక్కగా వినియోగించుకోవవచ్చు. అమెజాన్ లో ఈ ఫ్యాన్ రూ.3,449కు అందుబాటులో ఉంది. దీనిపై 1+1 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు.
లివింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీసుతో పాటు అన్నిచోట్లా వినియోగించుకునేందుకు హావెల్స్ 400 ఎంఎం స్వింగ్ పెడెస్టల్ ఫ్యాన్ బాగుంటుంది. సొగసైన డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. 1350 ఆర్పీఎం వద్ద నడిచే హై స్పీడ్ మోటారు నుంచి వేగంగా వచ్చే గాలి పెద్ద గదులను కూడా చల్లబరుస్తుంది. భద్రత కోసం 120 రిబ్స్ గార్డ్, టెలిస్కోపిక్ అమరిక, తక్కువ విద్యుత్ వినియోగం దీని ప్రత్యేకతలు. ఈ ఫ్యాన్ పై రెండేళ్ల వారంటీ కూడా ఇస్తున్నారు. దీన్ని అమెజాన్ లో రూ.3149కి కొనుగోలు చేయవచ్చు.
ఓరియంట్ ఎలక్ట్రిక్ స్టాండ్ – 82 పెడెస్టల్ ఫ్యాన్ ను పెద్ద గదుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. సమర్థవంతమైన మోటారు, సొగసైన డిజైన్, 3 – స్పీడ్ పియానో స్విచ్, 90 డిగ్రీల అసిలేషన్ మెకానిజం, సర్దుబాటు చేసుకోగల టెలిస్కోపిక్ ఎత్తు దీని ప్రత్యేకతలు. ఈ ఫ్యాన్ లో వంద శాతం రాగి వైండింగ్ మోటారును ఏర్పాటు చేశారు. దీని వల్ల మన్నిక, సామర్థ్యంపై ఎటువంటి సందేహం ఉండదు. మోటారు వేడెక్కకుండా నిరోధించడానికి సహాయ పడుతుంది. 2 డీబీ శబ్ద స్థాయి కారణంగా ఫ్యాన్ తిరిగినప్పుడు చాలా తక్కువ సౌండ్ వస్తుంది. రెండేళ్ల వారంటీతో లభిస్తున్న ఈ ఫ్యాన్ ను అమెజాన్ లో రూ.2,299కి కొనుగోలు చేయవచ్చు.
దోమలను ఆకర్షించి, వాటిని చంపే దోమల వేపరైజర్ కలిగిన పాలికాబ్ మార్వో యాంటీ మాస్కిట్ 400 ఎంఎం అసిలేటింగ్ పెడెస్టల్ ఫ్యాన్ నుంచి వేగవంతమైన చల్లని గాలి వీస్తుంది. ఇల్లు లేదా కార్యాలయాల్లో వినియోగించుకోవచ్చు. హై- స్పీడ్ మోటారు నుంచి వెలువడే శక్తివంతమైన గాలి మీ గదిలోని ప్రతి మూలకూ చేరుతుంది. ఇన్ బిల్ట్ మస్కిటో రిపెల్లెంట్ లిక్విట్ వేపరైజర్ దోమలను రెండు రెట్ల వేగంతో చంపుతుంది. 1350 ఆర్పీఎం వేగం, ఏరోడైనమిక్ బ్లేడ్లు, వందశాతం రాగి వైడింగ్ మోటారు, 180 డిగ్రీల యాంగిల్, బటన్ నియంత్రణ వ్యవస్థ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.2,399కి ఈ ఫ్యాను లభిస్తోంది.
అవసరానికి తగినట్టు చల్లని గాలిని అందించే ఫ్యాన్లలో వి-గార్డ్ ఎస్పెరా 5 బ్లేడ్ పెడెస్టల్ ఫ్యాన్ ఒకటి. దీనిలోని 1300 ఆర్పీఎం మోటారు చల్లని గాలిని, వేగవంతంగా అందిస్తుంది. మూడు రకాల స్పీడ్ మోడ్ లతో గాలి వేగాన్ని నియంత్రణ చేసుకోవచ్చు. నారింజ – నలుపు రంగు డిజైన్ తో మీ ఇంటికి మంచి అందాన్ని ఇస్తుంది. రిమోట్ కంట్రోల్ తో గదిలో ఎక్కడి నుంచైనా ఫ్యాన్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. అలాగే ఫ్యాన్ ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, టైమర్ ను సెట్ చేయాలన్నా బటన్ పై ఒక్క క్లిక్ తో చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల వారంటీ కలిగిన ఈ ఫ్యాన్ ధర అమెజాన్ లో రూ.3,299కు అందుబాటులో ఉంది.