
పైన ఫోటోను చూశారు కదా… సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ త్రోబ్యాక్ ఫోటోలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ స్టార్స్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. అంతేకాదు.. ఆ ముగ్గురు తండ్రి కొడుకులు. వాళ్లు ఎవరో కాదండి.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన నటవారసులు. అక్కినేని నాగేశ్వరరావు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని నాగార్జున. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నాగ్ కు అమ్మాయిల్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు నాగార్జున తర్వాత ఆయన వారసులుగా అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ సైతం తెలుగు చిత్రపరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
ప్రస్తుతం నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ హీరో ధనుష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు ఇటీవలే తండేల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు చైతూ. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి విభిన్న కంటెంట్ కథతో అడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు చైతూ.
ఇవి కూడా చదవండి
ఇక అఖిల్ విషయానికి వస్తే.. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఏజెంట్ సినిమాతో అడియన్స్ ముందుకు రాగా.. ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయ్యాడు అఖిల్. ఇప్పుడు మరోసారి యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని హీరోలు కలిసి ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ పిక్ చూస్తుంటే సూపర్ సినిమా సెట్ లోనిది అని తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జున, చైతన్య ఇద్దరి లుక్స్ అదిరిపోయాంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
From the sets of #Super
నాగచైతన్య అఖిల్ ఇద్దరు సినిమా సెట్స్ లొ…. నాగచైతన్య సినిమాల్లొకి రాక ముందు నుంచె లుక్… 👌 @iamnagarjuna @chay_akkineni @AkhilAkkineni8 #Akhil6 #NC24 #Coolie #Nagarjuna #Akhil #NagaChaitanya pic.twitter.com/t0Kpd4dyl6
— MahaRameswar (@MMRameswar) April 15, 2025
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?