
రాశీఖన్నా నటించిన అగత్య ఇటీవల రిలీజ్ అయింది. హారర్ థ్రిల్లర్ ఫాంటసీ సబ్జెక్ట్ ఇది. ఈ తరహా సినిమాల్లో నటించడం అంత తేలికైన పని కాదంటున్నారు రాశీ. వాటిలో నటించడానికి మానసికంగా ప్రిపేర్ కావడానికి చాలా సమయం పడుతుందన్నది ఈ లేడీ అభిప్రాయం. అంతే కాదు, సీన్ కంప్లీట్ చేశాక అందులోనుంచి బయటకు రావడం కూడా పెద్ద ఎక్సర్సైజ్ అంటున్నారు.