
దిన ఫలాలు (ఏప్రిల్ 12, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఏదో రూపేణా మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఏదో రూపేణా మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిత్రులతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరడమే తప్ప తప్పడం ఉండదు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. ఎలాంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా రాణిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకుంటారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. బంధువుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం వల్ల ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. తలపెట్టిన వ్యవహారాలు, కార్యకలాపాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలనిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. సొంత పనుల మీద కాస్తంత శ్రద్ద పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలువింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఎటువంటి ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. కానీ, ఆర్థిక విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆర్థిక సహాయం కోసం బంధుమిత్రులు కొద్దిగా ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి కొన్ని ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి.