
ఇప్పుడది పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆ దంపతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిరీత్యా పూల్ కార్ డ్రైవర్ అయిన నవాబ్ షేక్, సాధారణ వాహనంలా నడిపే వీలున్న ఒక ప్రత్యేకమైన మంచం బండిని రూపొందించాడు. 5×7 అడుగుల పరుపులు, దిండ్లు, స్టీరింగ్ వీల్, వెనుక అద్దాలు, బ్రేక్ సిస్టమ్‌తో సహా డ్రైవర్ సీటు తో ఈ కారును తయారుచేశాడు. అంతటితో ఆగకుండా ఆ కారులో రోడ్డుపై చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాడు. రాణీనగర్ మరియు డోమ్కల్ మధ్య ఈ ‘చక్రాల మంచం’ తిరుగుతుండటంతో భారీగా జనం గుమిగూడుతున్నారు, దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తనకు 1.5 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని నవాబ్ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ కావడం తన కల అని అందుకే ఈ కారు తయారుచేశానని చెప్పాడు. దీనికోసం ఒక ఇంజిన్, స్టీరింగ్, ఇంధన ట్యాంక్, ఒక చిన్న కారు బాడీ విడిభాగాలను స్థానిక వర్క్‌షాప్ నుండి కొనుగోలు చేశానని, ఓ వడ్రంగితో చెక్క మంచం తయారుచేయించానని, అందుకు రూ. 2.15 లక్షలు ఖర్చు అయిందని తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకానికి కన్యత్వం.. రూ. 18 కోట్లకు కొన్న స్టార్ హీరో
‘నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..’ చిరు ఎమోషనల్ ట్వీట్