
చాలా సార్లు మనం నడుస్తున్నప్పుడు రోడ్డుపై డబ్బు లేదా నాణేలు పడి ఉండటం చూస్తాము. చాలా మంది ఏమీ ఆలోచించకుండా వెంటనే వాటిని తీసుకుంటారు. తమ అదృష్టంగా భావించి దాచుకుంటారు. చాలా మంది తమకు దొరికిన డబ్బులను అవసరమైన వారికి దానం చేస్తారు. అయితే కొంతమంది ఈ డబ్బు లేదా నాణేలను ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతారు. నిజానికి రోడ్డుపై పడి ఉన్న విలువైన వస్తువులను కనిపించడం చాలా విషయాలను సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం సరైనదా కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో మన పురాణ గ్రంథాలు ఏమి చెబుతాయో తెలుసుకుందాం.
- ఎవరికైనా రోడ్డుమీద పడి ఉన్ననాణెం కనిపిస్తే అది తీసుకోవడం శుభప్రదమని అంటారు.
- అలాగే ఇలా కనిపించడం అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భావిస్తారు. మీరు రోడ్డుపై డబ్బును చూస్తే, మీ పూర్వీకుల నుంచి మీకు ప్రత్యక్ష ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
- అంతేకాదు ఎవరికైనా రోడ్డుపై పడి ఉన్న నాణెం కనిపిస్తే అక్కడ త్వరలో ఏదో కొత్త పని ప్రారంభించనున్నారని అర్ధం.
- అనేకాదు కొత్త ఉద్యోగం లభిస్తుందని.. విజయాన్ని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది నమ్మకం. అంటే లక్ష్మీ దేవి మీ పట్ల సంతోషంగా ఉందని.. అమ్మవారి అనుగ్రహంతో అకస్మాత్తుగా ఎక్కడి నుండో సంపదను పొందే అవకాశం ఉందని అర్ధమట.
- అంతేకాదు మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతుంటే.. దానిలో కూడా ప్రయోజనం పొందనున్నారట. ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా, రోడ్డుపై పడి ఉన్న డబ్బు కనిపిస్తే మీరు వెళ్తున్న పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనడానికి ఇది సంకేతం అని నమ్ముతారు.
- పర్సు వంటి పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తే.. మీ పూర్వీకుల ఆస్తి మీకు అందుతుందని అర్థం. మీకు దొరికిన డబ్బు మీది కాదు కనుక ఆ డబ్బులను సొంత యజమానికి అందించండి. ఇలా చేయడం మీకు గొప్ప అదృష్టాన్ని తెస్తుంది.
- రోడ్డు మీద డబ్బు కనిపించడం శుభసూచకమే అయినా.. ఆ డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నవారికి ఇవ్వడం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేస్తే, దేవుడు అనుగ్రహం మీకు లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.