
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాత్ మోచేయికి గాయమైంది. దీంతో అతను టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. రుతురాజ్ దూరం కావడంతో అతని స్థానంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టోర్నీకి దూరమైన రుతురాజ్ తొలిసారి స్పందించాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం, నేను రుతురాజ్. దురదృష్టవశాత్తూ మోచేయి గాయం కారణంగా ఐపీఎల్లో మిగతా మ్యాచ్‌లకు దూరం కావడం నిజంగా బాధగా ఉంది.
కానీ, మీ అందరికి సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఈ సీజన్లో మేం(సీఎస్కే) మేము కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాం, కానీ, ఓ యంగ్ వికెట్ కీపర్ టీమ్‌ను నడిపించబోతున్నాడనే విషయం మీకు తెలిసిందే. సో.. పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను. నేను జట్టుతో ఉంటాను, వారికి నా సపోర్ట్ ఇస్తాను. ప్రస్తుతం మేమున్న పరిస్థితి నుండి బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. కానీ కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు. అయితే నేను డగ్-అవుట్ నుండి టీమ్‌కు నా సపోర్ట్ అందిస్తాను. సీజన్లో రాబోయే మ్యాచ్‌ల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ” అని రుతురాజ్ సీఎస్కే తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
కాగా ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన ఫేలవంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చెపాక్‌లో ఓడించిన చెన్నై, మళ్లీ విజయం ముఖం చూడలేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. వాళ్లకు ఇంకా 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో కనీసం 6 గెలిస్తే నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. లేదంటే.. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కష్టమే. మరి ఈ పరిస్థితిని మాస్టర్ మైండ్ ధోని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
Straight from Rutu’s soul! 🤳💛📹#WhistlePodu #AllYouNeedIsYellove 🦁💛 pic.twitter.com/PNIZBWR1yR
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..