
తెలుగురాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగలంతా ఎండ మండిపోతుంటే.. సాయంత్రం అయ్యే సరికి వాన దంచికొడుతోంది. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఎండ – వానతో పాటు ఈదులు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానకి తోడు గాలిదుమారానికి చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోంది. వచ్చే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు ఉంటాయంటోంది వాతావరణ విభాగం. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ విభాగం అధికారులు. అయితే కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలో మాత్రం మరో రెండు రోజుల పాటు మోస్తరు వానలు ఉంటాయంటున్నారు.
ఇదిలా ఉంటే.. కొన్నిచోట్ల వానలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని ప్రాంతాల్లో పగటిపూట ఎండలు మంటపుట్టిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ముందుగా నిన్న ఏపీలో ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. ప్రకాశం జిల్లా నందనమారేళ్లలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తిరుపతిలోని వెంకటగిరిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కడపజిల్లా ఒంటిమిట్టలో 41 డిగ్రీలు, నంద్యాలజిల్లా దొర్నిపాడులో 40.8 డిగ్రీలు, విజయనగరం జిల్లా ధర్మవరంలో – 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ విషయానికొస్తే.. ప్రధానంగా ఆదిలాబాద్జిల్లాలో మాడు పుట్టింటే ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో 40.8 డిగ్రీలు, మెదక్లో 39.8 డిగ్రీలు, ఖమ్మంలో 38.6 డిగ్రీలు, రామగుండంలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి