

భారతదేశం చాలా వైవిధ్యమైనది. సాంస్కృతిక, మతపరమైన పరంగా గొప్పది. మన దేశంలో విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేవాలయాలు వాటి ప్రత్యేక సంప్రదాయాల కారణంగా తమ ప్రత్యేక గుర్తింపును నిలుపుకున్నాయి.అలాంటి అద్భుతమైన ఆలయాలు కోల్‌కతా నగరంలో కూడా ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయంలో నూడుల్స్‌ను ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ ఆలయం మహానగరంలో ఎక్కడ ఉంది? దాని పూర్తి కథ ఏమిటో తెలుసుకుందాం..
కోల్‌కతాలోని ఏ ఆలయంలో నూడుల్స్ నైవేద్యంగా పెడతారు ?
చైనీస్ కాళి ఆలయం కోల్‌కతాలోని టెంగ్రా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం చైనా టౌన్ పేరుతో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. చైనీస్ కాళి ఆలయం 60 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని హిందువులే కాదు చైనా ప్రజలు కూడా పుజిస్తారు. ఈ ఆలయ నిర్మాణం ఎలా సాగిందంటే.. ఇక్కడ ఒక చెట్టు కింద రాళ్లపై సింధూరం పూసి పూజలు చేసేవారని చెబుతారు. తరువాత ఇక్కడ ఒక ఆలయం నిర్మించబడింది. తరువాత దానిలో కాళి దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ ఆలయంలో బాలుడికి ప్రాణాలకు జీవం
మీడియా నివేదికల ప్రకారం.. ఒకప్పుడు చైనా కుటుంబానికి చెందిన 10 ఏళ్ల బాలుడి ఆరోగ్యం చాలా విషమంగా మారింది. వైద్యులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ఇక తాము ఏమీ చెయ్యలేమని చెప్పేశారు. ఆ సమయంలో ఆ పిల్లవాడి కుటుంబం ఆ చెట్టు కింద ఉన్న రాళ్ల దగ్గర తమ బిడ్డను పడుకోబెట్టి చాలా ప్రార్థించారు. కాళి దేవత వారి ప్రార్థనలు విని ఆ బిడ్డకు ప్రాణం పోసిందని చెబుతారు. నేడు ఆ ప్రదేశంలో అమ్మవారి ఆలయం నిర్మించబడింది. విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అయితే ఆ రెండు నల్ల రాళ్ళు ఇప్పటికీ అదే స్థలంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు నివసిస్తున్నారు. భారీ సంఖ్యలో చైనీయులు ఈ ఆలయానికి పూజలు చేయడానికి వస్తారు.
ఆలయంలో ప్రసాదంగా నూడుల్స్ ఇస్తారు.
ఈ ఆలయం గురించిన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రసాదంగా చైనీస్ ఆహారం మాత్రమే లభిస్తుంది. TOI నివేదికల ప్రకారం.. ఆలయంలో నూడుల్స్, చౌమెయిన్, ఫ్రైడ్ రైస్‌లను ప్రసాదంగా అందిస్తారు. మంచూరియన్ లాంటివి వడ్డిస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆలయంలో పూజ, ఆరతి నిర్వహిస్తారు, కానీ కాళీ దేవిని పూజించే సమయంలో కొవ్వొత్తులను కూడా వెలిగిస్తారు. దీనితో పాటు, చేతితో తయారు చేసిన కాగిత దీపాన్ని వెలిగించే ప్రత్యేక సంప్రదాయం కూడా ఇక్కడ ఉంది. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు దగ్గరకు రావని అంటారు. రెండు విభిన్న సంస్కృతులను ఏకం చేసే, సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది ఈ ఆలయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు