
గరుడ పురాణంలో పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే విషయాలను మాత్రమే కాదు ఎవరైనా మరణించిన తర్వాత చేసిన పనులకు ఎటువంటి శిక్షలు పొందుతారో కూడా పేర్కొంది. అంతేకాదు మనిషి మరణ సమయంలో ఎలాంటి అనుభవాన్ని పొందుతాడు మరణానంతరం ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది.. సుఖదుఃఖాలను ఎలా పొందుతుంది, ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీ మహా విష్ణువు వివరించాడు. అయితే మరణించిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళకుండా స్వర్గంనికి వెళ్ళాలంటే..చనిపోయినప్పుడు కొన్ని వస్తువులు అతని దగ్గర పెడితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొంది. అవి ఏమిటంటే
తులసి మొక్క: ఎవరికైనా మరణం ఆసన్నం అయిందని తెలిసిన వెంటనే అతడిని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి. అంతేకాదు తులసి దళాలు, మంజరి నుదిటి మీద పెట్టాలి. తులసి నీరుని నోట్లో పోయాలి. ఇలా చేయడం వలన మరణానంతరం ఆత్మ యమలోకానికి వెళ్లదని నమ్మకం.
గంగా జలం: ఎవరికైనా మరణించే సమయం ఆసన్నం అయిందని తెలిసినప్పుడు తులసి దళాలు కలిపి నీరు నోట్లో పోస్తారు. అయితే గంగాజలంలో తులసి దళాలు వేసి నీరు పోయడం అత్యంత శ్రేష్టం అని చెబుతున్నారు. లేదా మరణించే ముందు అతని నోటిలో గంగాజలం పోయండి. ఇలా చేయడం వలన జీవితకాలంలోని చేసిన పాపాలు తొలగి మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గంలో స్థానం దొరుకుతుందని నమ్మకం.
ఇవి కూడా చదవండి
దర్భలు: దర్భ ఒక పవిత్ర గడ్డి. దీనిని పూజాది కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. అయితే మరణ సమయంలో వ్యక్తిని దర్భతో చేసిన చాప మీద పడుకోబెట్టి, మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకుని వేయడం వలన అతని ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం.
నల్ల నువ్వులు: విష్ణువు ధూళి నుంచి జన్మించిన నల్ల నువ్వులకు విశిష్ట స్థానం ఉంది. మరణానికి ముందు.. అతని చేతులతో నువ్వులను దానం చేయించడం వలన మరణానంతరం ఆత్మ ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వర్గంవైపు పయనిస్తుందని నమ్మకం.
దుస్తులు: గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు. కనుక మరణించిన వారి దుస్తులను కుటుంబ సభ్యులు ధరించవద్దు అనే నియమం ఉంది. ఎందుకంటే అతని దుస్తులను ధరిస్తే వారి ఆత్మ ఆకర్షించవచ్చు. మరణించిన తరువాత అతని దుస్తులను, వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం ఆత్మకు శాంతిని, మోక్షాన్ని ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.