

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, అగ్నిప్రమాదాలు తదితర వాటిని వల్ల నష్టం ఏర్పడితే బీమా ద్వారా రక్షణ లభిస్తుంది. వీటిలో బ్యాటరీలు, ఛార్జింగ్ సిస్టమ్‌ల వంటి ప్రత్యేక భాగాలు ఉంటాయి. బ్యాటరీ వైఫల్యం, ఛార్జింగ్ పరికరాలకు నష్టం, మరమ్మతులు వంటి వాటిని ప్రత్యేక బీమా పాలసీ కవర్ చేస్తుంది. ఈ కింద తెలిపిన విధంగా బీమా కవరేజీ లభిస్తుంది.
ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిక్ వాహనానికి నష్టం కలిగితే రిపేర్, రీప్లేస్మెంట్ ఖర్చులను బీమా అందిస్తుంది.
విపత్తులు
వరదలు, భూకంపాలు, అల్లర్లు, విధ్వంసం తదితర సంఘటనల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
దొంగతనం
బైక్ దొంగతనానికి గురైనప్పుడు, పోలీసులు నాన్-ట్రేసబుల్ సర్టిఫికెట్ జారీ చేస్తే పరిహారం అందిస్తుంది.
అగ్నిప్రమాదం
ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటల వల్ల వాహనం కాలిపోయినా, నష్టం కలిగినా భర్తీ చేస్తుంది.
థర్డ్ పార్టీ బాధ్యత
మరొక వ్యక్తి ఆస్తి, వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
వ్యక్తిగత ప్రమాదం
బీమా తీసుకున్న వ్యక్తి గాయపడిన, మరణించిన సందర్భంలో ఆర్థిక పరిహారాన్ని అందిస్తుంది.
కవర్ కాని సందర్బాలు ఇవే..
కొన్ని సందర్బాల్లో మాత్రం బీమా తీసుకున్న నష్టం కవర్ కాదు. ఈ కింద తెలిపిన సందర్బాల్లో బీమా ఆదుకోదు.
సొంత నష్టం
మీకు థర్డ్-పార్టీ ఇన్స్యూరెన్స్ మాత్రమే ఉన్నప్పుడు, మీ సొంత బైక్‌కు జరిగే నష్టం కవర్ కాదు.
చెల్లని డాక్యుమెంటేషన్
రైడర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, బీమా పాలసీ లేకపోతే క్లెయిమ్‌లు చెల్లవు.
మద్యం
ప్రమాదం జరిగిన సమయంలో రైడర్ మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో ఉంటే బీమా వర్తించదు.
ఉద్దేశపూర్వక నష్టం
పాడైపోయిన బైక్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల మరింత నష్టం జరుగుతుంది. దానికి బీమా కవర్ చేయరు.
యాడ్ ఆన్ లు
ఎంచుకున్న యాడ్-ఆన్ల ద్వారా కవర్ చేయబడిన నష్టాలు మాత్రమే పాలసీలో చేర్చబడతాయి.
సంప్రదాయ పెట్రోలు వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా చాలా అవసరం. ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకుందాం.
ప్రీమియం ఖర్చులు
ఎలక్ట్రిక్ వాహనాలలో భాగాలు చాలా ఖరీదు కలిగి ఉంటాయి. ముఖ్యంగా బ్యాటరీల ధర ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ వాటి బీమా ప్రీమియాలు పెట్రోలు వాహనాలకంటే తక్కువగా ఉంటాయి.
బ్యాటరీ కవరేజీ
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి బ్యాటరీ డ్యామేజ్ కవరేజీ ఉంటుంది. ఎందుకంటే ఇది బండిలో అత్యంత ఖరీదైన భాగం.
రిపేర్ ఖర్చులు
అధునాతన భాగాల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీమా కవరేజీకి కారణమవుతాయి.
ఛార్జింగ్ పరికరాలు
కొన్ని ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు పెట్రోల్ బైక్‌లకు సంబంధం లేని ఇంటి ఛార్జింగ్ స్టేషన్ల వంటి బాహ్య ఛార్జింగ్ పరికరాలను కవర్ చేస్తాయి.
సాయం
ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జ్ ప్రయాణం మధ్యలో అయిపోతే కొన్ని బీమా సంస్థలు మద్దతు అందిస్తాయి, ఇది పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు ఉండదు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
కొన్ని రాష్ట్రాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రాయితీలను అందిస్తాయి. మొత్తం యాజమాన్య వ్యయాన్ని తగ్గించడం, బీమా ప్రీమియం తగ్గించడం వంటివి వీటిలో ఉంటాయి. పెట్రోల్ బైక్‌లకు అలాంటి ప్రోత్సాహకాలు అందుబాటులో లేవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి