
విజయనగరం జిల్లా మెంటాడ మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే రింగ్ రోడ్డు పై త్రాచుపాము హల్చల్ చేసింది. రోడ్డుపై తెలుపు, గోధుమవర్ణం కలగలిసిన దాదాపు 10 అడుగుల నాగుపాము రోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ కూర్చుంది. రాత్రివేళ హైవేపైదూసుకెళ్తున్న వాహనాల వెలుగులో రోడ్డుపై మెరుస్తూ కనిపించిన నాగుపామును చూసి ఒక్కసారిగా వాహనదారులు తమ వెహికల్స్‌ను ఆపేశారు. అయితే ఆ నాగుపాము ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఈ క్రమంలో చుట్టలా చుట్టుకొని పడగవిప్పి బుసలు కొడుతూ రోడ్డుపై కూర్చుని అందరినీ పరిశీలనగా చూస్తున్న నాగుపామును స్థానికులు తమ మొబైల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తీసుకున్నవాడికి తీసుకున్నన్ని వీడియోలు..ఫోటోలు అన్నట్టుగా వారందరికీ ఆ నాగుపాము తనదైనస్టైల్లో ఫోజులిచ్చింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం
సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ