బొప్పాయి చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచుతాయి. బొప్పాయిని చర్మానికి రాయడం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య రాదు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
