అంకుల్ మీ సైక్లింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుటుంబం ఎక్కడికో ప్రయాణమైంది. భార్య, బిడ్డను బస్సు ఎక్కించేందుకు సైకిలుపైన తీసుకెళ్తున్నాడు. భార్య సైకిలుపైన వెనుక కూర్చోగా.. బిడ్డను ఆమె భర్త తన భుజాలపైన కూర్చోబెట్టుకొని సైకిలు తొక్కుతూ వెళ్తున్నాడు. ఇంతలో వాళ్లు ఎక్కాల్సిన బస్సు బస్టాప్ నుంచి వెళ్లిపోతోంది. అలా ముందుకు వెళ్లిన బస్సు కొంతదూరం వెళ్లాక ఎవరినో దింపేందుకు ఆగింది. అదే అదనుగా ఈ వ్యక్తి సైకిలును వేగంగా తొక్కుకుంటూ నేరుగా వెళ్లి బస్సు డోరువద్ద ఫుట్బోర్డుపైన కాలుమోపి సైకిలు ఆపాడు. వెంటనే మహిళ సైకిలు దిగి బస్సు ఎక్కింది. ఆ వెంటనే తన భుజాలపై ఉన్న బిడ్డను ఆమెకు అందించాడు. ఇదంతా గమనించిన బస్సు డ్రైవర్ బస్సును వీరు ఎక్కేవరకూ ఆపాడు. దీంతో వీరి ప్రయాణం ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్బెల్స్ మోగిస్తుండటంతో జనంలో భయం
భార్య వేధింపులతో నరకం చూస్తున్నా.. కాపాడండి బాబోయ్
