గతంలో ఇదే దారిలో పైవంతెన సమీపంలో, లెప్రసీ కాలనీ వద్ద, గొల్లగూడ రోడ్డులో యూటర్న్లు ఉన్నా.. ఏడాది క్రితం ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వాటిని మూసివేశారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పానగల్ పైవంతెన నుంచి కేశరాజుపల్లి వరకు ఉన్న యూటర్నులను మూసి వేయడంతో ఎదురుగా ఉన్న వారిని కలవాలంటే కనీసం మూడు కిలో మీటర్లు తిరగాల్సి వస్తుంది. ఎదురుగా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయనే భయంతో అంత దూరం వెళ్లక తప్పడం లేదు. ప్రత్యామ్నాయం లేక వ్యవసాయదారులు అడ్డదిడ్డంగా రోడ్డు దాటుతుంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ తాము పడుతున్న ఇబ్బంది గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పురపాలక చైర్మన్ పరిస్థితి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
భారత్లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!
