

విశాఖ లో ఆక్సిజన్ టవర్స్‌లో డెలివరీ బాయ్‌పై జరిగిన దాడి ఘటనలో తమకు టీవీ9 అండగా నిలిచిందని…టీవీ9 ప్రసారం చేసిన కథనాల వల్లే తమకు ధైర్యం రావడమే కాదు.. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేసిందని టీవీ9కు కృతజ్ఞతలు తెలిపారు డెలివరీ బాయ్స్.
విశాఖలో ఓ డెలివరీ బాయ్‌పై దాడి ఘటన బయటకు రాగానే TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రతిరోజూ అపార్ట్మెంట్లకు వెళ్తూ వేలాది పార్సిల్స్ డెలివరీ చేస్తున్న తమపైనే దాడులా..అంటూ ప్రశ్నిస్తున్నారు స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్స్కు కొన్ని హక్కులు ఉన్నాయి. పని స్వేచ్ఛ, డెలివరీకి చెల్లింపు, భద్రతా సౌకర్యాలు వీరి ప్రాథమిక హక్కులు. కానీ చట్టపరంగా వీళ్లకు పూర్తి రక్షణ లేదు. భారత్‌లో గిగ్ వర్కర్స్కు ప్రత్యేక చట్టం లేకపోవడంతో, సాధారణ క్రిమినల్ చట్టాలే అమల్లో ఉంటున్నాయి. తాము రోజు రిస్క్ తీసుకుంటామని…రక్షణ కావాలని అడిగితే కంపెనీలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ..ప్రభుత్వాలు దీనిపై దృష్టిపెట్టాలంటున్నారు డెలివరీ బాయ్స్..
స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే డెలివరీ బాయ్స్‌కు ఎలాంటి హక్కులుంటాయో చూస్తే…ఫస్ట్ వర్క్ ఫ్రీడమ్ ఉండాలి. ఆర్డర్ తీసుకోవడం..స్కిప్ చేయడం వాళ్లిష్టం. సెకండ్ ..పనికి ఫలితం. మూడోది సేఫ్టి. హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్ లాంటివి ఇవ్వాల్సిందే కానీ కొన్ని కంపెనీలు అవి కూడా ఇవ్వడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక నాలుగోది ఇన్సూరెన్స్. కొన్ని కంపెనీలు యాక్సిడెంట్ కవరేజ్ ఇస్తాయి, లక్షల్లో క్లెయిమ్ ఆప్షన్ ఉంది కానీ అరుదుగా అమలవుతోంది. వీళ్లు ఫుల్ టైం ఎంప్లాయీస్ కాదు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ మాత్రమే. కాబట్టి PF, సెలవులు, బెనిఫిట్స్ లాంటివి ఉండవు.
భారత్‌లో డెలివరీ బాయ్స్‌కు డెడికేటెడ్ లా లేదు, వీళ్లను కాంట్రాక్టర్స్‌గా ట్రీట్ చేస్తారు కాబట్టి లేబర్ లాస్ – ఫ్యాక్టరీస్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ – ఇవేవీ అప్లై కావు. కానీ దాడి జరిగితే IPC సెక్షన్ 323 వాలంటరీ హర్ట్, 324 .వెపన్తో గాయపరచడం, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ లాంటివి అప్లై చేయవచ్చు. యాక్సిడెంట్ అయితే మోటార్ వెహికల్ యాక్ట్ కింద క్లెయిమ్ ఛాన్స్ ఉంది. కానీ రోజూ ట్రాఫిక్, వాతావరణం, కస్టమర్ గొడవలు , ఇవన్నీ కవర్ చేసే యాక్ట్ జీరో! 2020లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్లో గిగ్ వర్కర్స్కు హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ హామీ ఇచ్చారు కానీ 2025 వచ్చినా అమలు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
ప్రస్తుతం దేశంలో గిగ్ ఎకానమీ రాకెట్లా దూస్తోంది కానీ ఈ డెలివరీ బాయ్స్ సమస్యలు మాత్రం మూలనపడిపోతున్నాయ్. రోజూ లక్షల మంది డోర్‌స్టెప్ కంఫర్ట్ కోసం వీళ్లపై డిపెండ్ అవుతారు. కానీ వీళ్ల రిస్క్ ఎవరు కవర్ చేస్తారు? ఒక్క డెలివరీ బాయ్ రోజుకు 20-30 ఆర్డర్స్ చేస్తాడు, వారానికి రూ. 8,000-15,000 సంపాదిస్తాడు కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. అందుకే తమకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు డెలివరీ బాయ్స్.