
చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. చికెన్‌తో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. చికెన్‌తో చేసే రెసిపీల్లో.. కొత్తిమీర చికెన్ రోస్ట్ కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్, హోటల్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చపాతీ, నాన్స్, పులావ్, వేడి వేడి రైస్‌లో ఆహా చెప్పాల్సిన పని లేదు. ఇది చేయడానికి కూడా పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. చాలా ఈజీగా చేసేయవచ్చు. మరి చికెన్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
చికెన్ రోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:
చికెన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఫ్రైయిడ్ ఆనియన్స్, ఆయిల్, బటర్ లేదా నెయ్యి.
చికెన్ రోస్ట్ తయారీ విధానం:
ముందుగా చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర పేస్ట్ కూడా కలిపి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం ఓ గంట సేపు అయినా మ్యారినేషన్ చేయాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్, నెయ్యి లేదా బటర్ కొద్దిగా వేసి వేడి చేయాలి. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ నేరుగా వేసి మొత్తం కలపాలి. నీరంతా పోయి చిన్న మంట మీద మొత్తం అంతా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ అంతా దగ్గర పడ్డాక మళ్లీ ఒకసారి మిక్స్ చేసి.. ఉప్పు, కారం కావాలంటే మళ్లీ వేసి కలపొచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర చికెన్ రోస్ట్ సిద్ధం. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.