
సోషల్ మీడియాలో ప్రతిరోజు పాములకు సంబంధించి అనేక వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పాముల సయ్యాటలు, ఫైటింగ్‌ల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే కొంతమంది మాత్రం అత్యంత ప్రమాదకరమైన విషపు పాములతో ఆటలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. పాములకు దగ్గరగా వెళ్లడం, వాటిని తాకాలని ట్రై చేయడం వంటి పనులు చేస్తుంటారు. పైగా వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి ప్రమాదకరమైన వీడియోనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం.
పాముల్లో కెల్లా కింగ్ కోబ్రాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఒక్కసారి కాటేసిందా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి కింగ్ కోబ్రాతో ఓ యువకుడు విన్యాసాలు చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో ఉన్నదాని ప్రకారం నల్లటి కింగ్ కోబ్రా పడగవిప్పి బుసలు కొడుతూ ఉంటుంది. దాని చుట్టూ ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉంటారు. అందులో ఓ వ్యక్తి దాని మెడను ఎలాంటి రక్షణ లేకుండానే చేతితో తాకుతూ రెచ్చగొడుతుంటారు. దీంతో అది మరింత బుసలు కొడుతూ ఉంటుంది.
కింగ్ కోబ్రాను ముద్దు పెట్టుకోవడానికి ఆ యువకుడు అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. కింగ్‌కోబ్రా మాత్రం కాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా ఆ వ్యక్తి భయపడకుండా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఒకసారి కింగ్ కోబ్రా మూతికి ముద్దుపెట్టినట్లే పెట్టి పైకి లేస్తాడు. పక్కన ఉన్న మరో వ్యక్తి వద్దకు వెళ్లి చూశావా నా ప్రతాపం అన్నట్లుగా నవ్వుకుంటారు. ఇక మరోసారి కిందికి వంగి ఇప్పుడు ఏకంగా రెండు సార్లు పడగ విప్పిన కింగ్ కోబ్రా మూతికి ఇంగ్లీష్ కిస్ లేవల్లో ముద్దు పెడతాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తున్నారు. అబ్బాయిలు ఎందుకు ఎక్కువ కాలం జీవించలేరో మీకు అర్థం అయిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరికొంతమంది నెటిజన్స్ డిమాండ్ చేస్తూ తమ స్పందనను వ్యక్తపరుస్తున్నారు.