
జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. గుర్తుతెలియని యువతి వస్త్రాలు, వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండగులు.. నల్ల కోడిని బలిచ్చి తాంత్రిక పూజలు చేశారు.. మహిళ ఆకారంలో ముగ్గుతో పటం వేసి అందులో క్షుద్రపూజలు నిర్వహించారు.. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండగులు పారిపోయారు.. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు.. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.. పాలకుర్తి శివారులోని దర్దేపల్లి వాగులో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి.. మంగళారం అర్ధరాత్రి వేళ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. అయితే.. పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతున్నారు.. అయితే.. ఈ శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారి పోయారు.

Black Magic
క్షుద్రపూజలు నిర్వహించిన తీరు చూసి ఎవరో మహిళ లేదా యువతి వశీకరణ కోసం ఇలాంటి క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.. పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళ ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు.. అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు, తల వెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ పూజా సామాగ్రి ఉంచి.. క్షుద్ర పూజలు చేశారు.
వీడియో చూడండి..
ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు.. క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వశీకరణ కోసమో.. లేక శత్రు నాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..